Election Updates: పవన్ కళ్యాణ్ కి మద్దతుగా హీరో నవదీప్

Election Updates: Hero Navdeep supports Pawan Kalyan
Election Updates: Hero Navdeep supports Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని సినీ నటుడు నవదీప్ తెలిపారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి వచ్చిన ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నారు. నిజాయతీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు.

పవన్ కల్యాణ్ కి తన మద్దతు ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ కి విలక్షణమైన లక్షణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలనే దృక్పథం పవన్ కళ్యాణికి ఉందన్నారు. అంతే కాకుండా ఆయన సినీ హీరోగా రాణిస్తూనే సమాజ హితం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను నటించిన లవ్ మౌళి మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా శ్రీపాదవల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు.