National Politics: కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు యూనిఫాంపై ప్రకటన

National Politics: Announcement on police uniform in Kashi Vishwanath temple
National Politics: Announcement on police uniform in Kashi Vishwanath temple

వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఖాకీ యూనిఫామ్‌తో కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగించేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

భక్తుల సౌకర్యార్థం కోసం పలు ఇతర చర్యలు కూడా ఆలయ అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఆలయంలో రద్దీ నియంత్రలో ‘నో టచ్’ విధానాన్ని అవలంబించనున్నారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూలైన్లను నియంత్రిస్తారు. ‘‘దర్శనం కోసం భక్తులు పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రద్దీ నియంత్రణలో స్నేహపూర్వక విధానాలను అవలంబించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాం’’ అని తెలిపారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్.