సర్జికల్ స్ట్రైక్ కు మించిన అస్త్రాలున్నాయా..?

Pakistan Country has WeaponsThan India Army for war about Kashmir

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pakistan Country has WeaponsThan India Army for war about Kashmir

రజనీకాంత్ పాపులర్ మూవీ నరసింహలో ఓడైలాగ్ ఉంది. చెడ్డవాడు మొదట సుఖపడొచ్చు. తర్వాత కష్టపడక తప్పదు. కానీ మంచివాడు మొదట కష్టపడొచ్చు. కానీ తర్వాత సుఖాలు అనుభవిస్తాడు అని. ఇప్పుడు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ డైలాగ్ ను కాస్త మార్చి చెబుతున్నారు. తేలికపాటి యుద్ధాలతోనే ఫలితాలు సాధిస్తున్నామని సంబరపడుతున్న పాకిస్థాన్ కు మరిచిపోలేని గుణపాఠాలు చెప్పే అస్త్రాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు.

సర్జికల్ స్ట్రైక్ కే అల్లాడిపోయారని, అంతకు మించి మార్గాలున్నాయని, కానీ సరైన సమయంలో సైన్యం నిర్ణయం తీసుకుంటుందన్న రావత్ వ్యాఖ్యలు దాయాది దేశం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఇప్పటిదాకా వెన్నుపోటు పొడుస్తూ విజయం సాధించేస్తున్నామనే భ్రమలో ఉన్న పాకిస్థాన్ కు తన ప్రతిభ ఏంటో బాగా తెలుసు. అన్నీ తెలిసీ ఇండియాపై కాలు దువ్వుతోందంటే.. అది దాని అతి విశ్వాసం.

జవాన్లను ముక్కలుగా నరికే సంస్కృతి తమది కాదన్న రావత్.. ఎన్నోసార్లు పాక్ సైనికుల అంత్యక్రియలు చేశామని గుర్తుచేశారు. కశ్మీర్లో పరిస్థితిపై కూడా ఘాటుగా స్పందించారు. ఎప్పుడు రాళ్లదాడి ఆగితే.. అప్పుడే చర్చలు మొదలుపెడతామని స్పష్టం చేశారు. రావత్ మాటలు వింటుంటే కశ్మీర్లో సైన్యం వైఖరి మరింత కఠినంగా ఉంటుందని అర్థమవుతోంది. మరి వేర్పాటువాదులు ఎంతవరకూ దారికొస్తారో కాలమే నిర్ణయించాలి.

మరిన్ని వార్తలు:

ఉండవల్లి తెల్లజెండాలో ఆ రంగులున్నాయి.

ఖాకీ అలా పిలిస్తే వంకలు తిరుగుతున్నారు.