2.ఓ లో అక్షయ్ కుమార్ ఇరగాదిస్తున్నాడు…!

Robo 2.0 Movie Collections

సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో, తమిళ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చినా చిత్రం 2.ఓ ఈ చిత్రం ఇటివల విడుదలై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. కానీ చిత్రం వసూళ్ళ పరంగా మాత్రం చాలా వెనకబడింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం అనుకున్నా కలెక్షన్స్ ను రాబతలేకపోతుంది. తమిళనాడులో రజినీకాంత్ స్టామినా తగ్గిపోయింది అనుకుంటున్నారు. ఇటివల విడుదలైన ఇలయ దళపతి విజయ్ సర్కార్ సినిమా తొలి వారంలోనే 32 కోట్లు గ్రాస్స్ ను కలెక్ట్ చేసింది. 2.ఓ మాత్రం తొలి నాలుగు రోజులు కలిపి 31 షేర్… 55కోట్లు గ్రాస్స్ వసూలు చేసింది. 2.౦ చిత్రం రోబో కి సీక్వెల్ గా వచ్చింది పైగా ది గ్రేట్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో మరల చాలా అంచనాల నడుమ, బాహుబలి 2 కి పోటిగా విడుదలైనది. సినిమా కలెక్షన్స్ చూస్తే మాత్రం ఇది రజినీకాంత్ సినిమా కాదు అని పిస్తుంది.

robo-2.0-movie

2.ఓ చిత్రం బాలీవుడ్ లో మాత్రం ఇరగాదిస్తుంది. అక్షయ్ కుమార్ కు ఉన్నా క్రేజీ తో సినిమా మొదటి రోజు 25 కోట్ల గ్రాస్స్ ను రాబటింది. రెండోవరోజు 17.5 కోట్లు. మూడవరోజు 24 కోట్లు నాలుగోవ రోజు 34 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 100 కోట్ల వరకు హిందీలో రాబట్టింది. అక్షయ్ కుమార్ నటించిన పక్షి రాజు పాత్రకు అక్కడ బాగా కనెక్ట్ అయ్యారంట. 2.౦ చిత్రంలో హీరో రజిని కాంత్ ఆయినపటికి. బాలీవుడ్ లో జనాలు మాత్రం పక్షి రాజు పాత్రలో నటించినా అక్షయ్ నే మెయిన్ హీరో అంటునారు. రజిని కాంత్ వరస ప్లాప్ లతో సతమత మవుతుంటే. 2.ఓ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశను మిగిలించింది. రజిని నెక్స్ట్ సినిమా పెటా పైన కలెక్షన్స్ ప్రభావం మాత్రం భారీగానే ఉండనున్నది అని సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం