సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మరో ‘తిక్క’ సినిమా

jawan movie is Another flop movie for sai daram tej like tikka movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Jawan Movie Is Another Flop Movie For Sai Aaram Tej Like Tikka Movie

మెగా ఫ్యామిలీ నుండి తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఒక సక్సెస్‌ రెండు ఫ్లాప్‌లు అంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమాల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా అన్నట్లుగా సాయిధరమ్‌ తేజ్‌ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే పలు చెత్త సినిమాలను కూడా సాయిధరమ్‌ తేజ్‌ చేశాడు. తిక్క చిత్రం సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్‌లో పరమ చెత్త చిత్రంగా నిలిచి పోతుంది. సన్నిహితుడనే ఉద్దేశ్యంతోనో లేక ఎవరో చెప్పారని ఆ సినిమాను చేసి ఉంటాడు. ఆ సినిమాలో ఏమాత్రం మ్యాటర్‌ లేదు. ఇప్పుడు అదే విధంగా ‘జవాన్‌’ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందని అంటున్నారు.

రచయితగా పలు చిత్రాలకు చేసిన బివిఎస్‌ రవి ‘వాంటెడ్‌’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు  వ్యవహరించాడు. అవి కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. కాని ఏం చెప్పి మెగా హీరోను ఒప్పించాడో కాని అనుకోని అవషాడో డైరెక్టర్‌గాకాశం ‘జవాన్‌’ రూపంలో సాయిధరమ్‌ తేజ్‌ ఇచ్చాడు.

ప్రేక్షకుల్లో ఏమో కాని సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేవు. రవిపై నమ్మకం లేక పోవడంతో సినిమా పూర్తి అయిన తర్వాత కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దాంతో నిర్మాత దిల్‌రాజును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు కూడా ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకంను కనబర్చడం లేదని, కాకుంటే సినిమాను అమ్మేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇచ్చాడట. సాయి ధరమ్‌ తేజ్‌కు ఈ సినిమా మరో ‘తిక్క’ అంటూ ఆయన సన్నిహితులే అంటున్నారు. ఇప్పటికైనా సాయిధరమ్‌ తేజ్‌ కథల విషయంలో, దర్శకుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు