రాష్ట్రపతి ఎన్నికల్లో చిరునే ఫస్ట్‌

Megastar Chiranjeevi First name on the list of voters in President election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Megastar Chiranjeevi  First name on the list of voters in President election

ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. అధికార, విపక్ష కూటములు వారి వారి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పక్షంకు చెందిన అభ్యర్థి విజయం దాదాపు ఖాయం. అయినా కూడా కాంగ్రెస్‌ పార్టీ కూటమి అభ్యర్థిని పోటీకి దించింది. ఈ సమయంలో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దాంతో ప్రస్తుతం ఎన్నికల కమీషన్‌ ఓటర్ల జాబితాను సిద్దం చేసింది. ఆ ఓటర్ల జాబితాలో మన మెగాస్టార్‌ చిరంజీవి పేరు ముందు ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ రాష్ట్రపతి ఎన్నికల కోసం రాజ్యసభ, లోక్‌సభ, అన్ని రాష్ట్రాల్లోని శాసనసభ్యులతో ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా కోసం ఎన్నికల సంఘం అక్షర క్రమంను అనుసరించింది. దాంతో చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కనుక, అది కూడా ఏపీకి చెందిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు అందరి కంటే కూడా ముందు ఆంగ్ల అక్షరం ‘సి’తో ముందు ఉన్నాడు. దాంతో చిరంజీవి ఎన్నికల కోసం రెడీ చేసిన ఓటర్ల జాబితాలో మొదటి వ్యక్తిగా ఉన్నాడు. దీనిని మెగా ఫ్యాన్స్‌ గొప్పగా షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సినది ఏమీ లేదు. అయినా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి ఓటు వేసేవి చిరంజీవి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సరే ఎవరి ఆనందం వారిది అని వదిలేద్దాం.

మరిన్ని వార్తలు:

కాపీ కూడా కళేనని ఎప్పుడు తెలుసుకుంటారో..?

సర్జికల్ స్ట్రైక్ కు మించిన అస్త్రాలున్నాయా..?

రాష్ట్రపతి ఎన్నికల్లో చిరునే ఫస్ట్‌ - Telugu Bullet