కత్తితో వస్తే కౌగిలించుకున్న పోలీస్: వైరల్ వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Police Officer Calms Man With Knife By Hugging Him

ఎవరైనా వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్టేషన్ కి వస్తే ఏ పోలీస్ అయినా ఏమి చేస్తాడు ? అందుబాటులో వున్న తుపాకీతో కాల్చి పారేస్తాడు లేదా ఆ తుపాకీ చూపి భయపెట్టి ఆ కత్తిని లాగేసుకుంటాడు. కానీ థాయ్ లాండ్ కి చెందిన ఓ పోలీస్ అధికారి మాత్రం వచ్చిన వ్యక్తి మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని మాటలతో అతను కత్తి అప్పగించేలా ఒప్పించాడు. అంతే గాకుండా ఆ ఒత్తిడి నుంచి బయటపడేయడానికి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పోలీస్ అధికారి అనిరుత్ మాలీ.

థాయ్ లాండ్ లో రద్దీ ప్రాంతాల్లో సంగీత ప్రదర్శనతో ఒకతను పొట్టబోసుకునే వాడు. కొన్ని రోజుల కిందట ఎవరో ఆ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ కాజేశారు. దీంతో అతను పొట్టకూటి కోసం ఒకరి దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పని చేసాడు. మూడు రోజులు పని చేయించుకున్నాక అతను జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో అతను తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆ కుంగుబాటులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేతిలో కత్తి పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడి వారిని బెదిరించడానికి ట్రై చేసాడు. దీంతో ఓ పోలీస్ అతన్ని కాల్చబోగా అనిరుత్ వారిని వారించి మాటలతో అతని దగ్గరున్న కత్తిని తీసుకున్నాడు. ఓ కౌగిలింతతో అతన్ని ఓదార్చాడు. సీసీ టీవీ లో రికార్డు అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.