కమెడియన్‌కు ఖరీదైన శిక్ష

Comedian Prudhvi Pay 8 lakhs per month To Wife

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Comedian Prudhvi Pay 8 lakhs per month To Wife

 

‘ఖడ్గం’ చిత్రంలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ డైలాగ్‌ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన పృథ్వీ ఇటీవల మరీ ఫేమస్‌ అయ్యాడు. బ్రహ్మానందం ఫేమ్‌ తగ్గడంతో ఆ స్థానంను పృథ్వీ ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాలతో యమబిజీగా ఉండి, రోజుకు లక్ష నుండి రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్న పృథ్వీ కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీ వివాహం జరిగింది. అయితే ఇటీవల ఇద్దరి మద్య విభేదాలు తలెత్తడంతో కొన్నాళ్ల క్రితం ఇంటి నుండి పృథ్వీ బయటకు వెళ్లగొట్టాడు.

తాజాగా కోర్టును ఆశ్రయించిన శ్రీలక్ష్మి తన భర్త తనను ఇంటి నుండి వెళ్లగొట్టాడు, ఆయన సంపాదన బాగానే ఉంది, తనకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నెలకు పది లక్షల రూపాయలను భరణంగా ఇప్పించాల్సిందిగా విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు పృథ్వీ నెలకు 8 లక్షలు భరణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నెలకు 8 లక్షల భరణం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం పృథ్వీ నెలకు బాగానే సంపాదిస్తున్నప్పటికి జీవితాంతం ఇలా ఇవ్వడం అసాధ్యం. అయినా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత స్థాయి కోర్టులో అపీల్‌ చేస్తానంటున్నాడు. ఈ సమస్యల్లో ఇటీవల కాస్త సినిమాలపై శ్రద్దను తగ్గించాడు. దాంతో అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.

మరిన్ని వార్తలు:

కె.ఏ . పాల్ తో ఎన్టీఆర్ కి పనిపడింది.