బ్యాంకాక్‌ మాల్ లో కాల్పులు, ముగ్గురి మృతి

బ్యాంకాక్‌ మాల్ లో కాల్పులు, ముగ్గురి మృతి
Gun shoot

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ విలాసవంతమైన షాపింగ్ మాల్‌లో 14 ఏళ్ల బాలుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మాల్‌లోకి ప్రవేశించిన ముగ్గురు కస్టమర్లు చనిపోయారు. మరో నలుగురు వ్యక్తులు కూడా బుల్లెట్లకు గాయపడ్డారు. నిందితుడిని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేసి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం రద్దీ సమయంలో సియామ్ పారగాన్ షాపింగ్ సెంటర్‌లో ఒక బాలుడు కాల్పులు జరిపాడు. ఘటన సంబంధిత వీడియోలు కూడా బయటకి వచ్చాయి. కాల్పుల శబ్దం వినగానే వందలాది మంది బయటకు పరుగులు తీశారు.