ఎన్టీఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌

director-trivikram-given-a-big-shock-to-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను మరో రెండు మూడు రోజుల్లో పూర్తి చేయనున్నాడు. ఇక జై లవకుశ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా షురూ చేయనున్నారు. మరో వైపు బిగ్‌బాస్‌తో వారంలో రెండు మూడు రోజులు బిజీగా గడుపుతున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్‌ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. జై లవకుశ సినిమా విడుదల కాగానే ‘బిగ్‌బాస్‌’ షో కూడా పూర్తి అవుతుంది. అంటే అప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు అని ఎన్టీఆర్‌ భావించాడు. త్రివిక్రమ్‌తో సినిమా ప్రారంభం అయ్యే సమయానికి కొడుకుతో కొన్నాళ్ల పాటు ఆడుకుంటాను అంటూ సంతోషంగా ఉన్న ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్‌ షాక్‌ ఇచ్చాడు

‘బిగ్‌బాస్‌’ షో పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఎన్టీఆర్‌ను ఇండోనేషియా మరియు థాయిలాండ్‌ దేశాలకు రెండు నెలలు వెళ్లాల్సిందిగా త్రివిక్రమ్‌ ఆదేశించాడట. ఎన్టీఆర్‌ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి అనేది త్రివిక్రమ్‌ కోరిక. అందుకే ఎన్టీఆర్‌ను వచ్చే నెలలో అక్కడకు వెళ్లాల్సిందిగా త్రివిక్రమ్‌ సూచించాడు. త్రివిక్రమ్‌ సూచన మేరకు అక్టోబర్‌లో అక్కడకు వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ మరియు కొన్ని ఫైటింగ్‌ మెలకువలను నేర్చుకోవాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నాడు. అక్టోబర్‌ మరియు నవంబర్‌ మూడవ వారం వరకు అక్కడే ఉండనున్నాడు. డిసెంబర్‌లో వీరి కాంబో మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం పవన్‌తో త్రివిక్రమ్‌ చేస్తున్న సినిమా నవంబర్‌ లేదా డిసెంబర్‌ వరకు పూర్తి అయ్యి, జనవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ షురూ కాబోతుంది.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్