అవును…నువ్వే పెద్ద హీరో అంటున్న రానా మ‌న‌కు ఇవి వ‌ద్దంటున్న నాని

Rana And Nani Intresting Tweets on Twitter On Tollywood Super Star

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rana And Nani Intresting Tweets on Twitter On Tollywood Super Star

సినీ ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అనే చ‌ర్చ ఎప్పుడూ న‌డుస్తూనే ఉంటుంది. ఒక్క హీరోల‌నే కాకుండా హీరోయిన్లు, క‌మెడియ‌న్లు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు, విల‌న్లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, పాట‌ల ర‌చ‌యిత‌లు ఇలా సినిమాకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఈ నెంబ‌ర్ గేమ్ సాగుతుంటుంది. నెంబ‌ర్ వ‌న్ అనిపించుకోవాల‌ని కొంద‌రు,  ఆ స్థానాన్ని నిల‌బెట్టుకోవాలని మ‌రికొంద‌రు ఆరాట‌ప‌డుతుంటారు. క‌థానాయ‌కుల విష‌యం వ‌చ్చేస‌రికి పోటీ ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ‌మంది అభిమానులు, ఎక్కువ హిట్లు ఉన్న‌వాళ్లే నంబ‌ర్ వ‌న్‌. దీనికి వేరే కొలమానం ఏమీ లేదు. కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు టాలీవుడ్ లో చిరంజీవిని నెంబ‌ర్ వ‌న్ హీరో అంటుండే వారు. ఆయ‌న వ‌య‌సు పెర‌గ‌టం, రాజ‌కీయాల్లోకి వెళ్లిపోవ‌టంతో ఆ ప్లేస్ ఖాళీ అయింది.

అయితే ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ హీరో అంటే ఎవ‌రో చెప్ప‌టం క‌ష్ట‌మే. సీనియ‌ర్ హీరోలు మొద‌లుకుని యువ క‌థానాయ‌కుల‌దాకా అంద‌రూ పోటాపోటీగా రాణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తి క‌ర చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల హిట్ చిత్రాలు అందించిన రానా ద‌గ్గుబాటి, నాని, వ‌రుణ్‌తేజ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల్లో పెద్ద స్టార్ ఎవ‌రు అని  కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోలింగ్ నిర్వ‌హించారు. నానినే పెద్ద స్టార్ అని తేల్చారు. ఈ న‌లుగురిలో ఎవ‌రు పెద్ద స్టారో తెలిసిపోయింది. స‌ర్వేలో నానిదే అగ్ర‌స్థానం అంటూ ఒక నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో హైలెట్ చేసి చూపించాడు రానా. అవును…ఆయ‌నే అని ట్వీట్ కూడా చేశారు. రానా ఎంతో స్పోర్టివ్ గా చేసిన ఈ ట్వీట్ పై నాని కూడా అంతే స్పోర్టివ్‌గా స్పందించాడు. ఎవ‌రు మాట్లాడుతున్నారో చూడండి. ఇలాగే పోల్స్ పెట్టి చెడ‌గొట్టేస్తారు బాబాయ్ …మ‌న‌కి వ‌ద్దు …మంచి సినిమాలు చేసుకుంటూ పోదాం అని రానాను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దీనికి రానా అలాగే అంటూ ఇమోజీ పోస్ట్ చేశాడు. ఈ సంభాష‌ణ‌తో టాలీవుడ్ యువ హీరోలు ఎంత సఖ్య‌త‌గా ఉంటున్నారో అంద‌రికీ అర్ధ‌మ‌యింది. యువ హీరోలు ఇటీవ‌ల వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. నెటిజ‌న్లు పోటీలో ఉంచిన రానా సినిమా నేనే రాజు నేనే మంత్రి, నాని సినిమా నిన్ను కోరి, వ‌రుణ్ తేజ ఫిదా, విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి పెద్ద హిట్లు గా నిలిచాయి. దీంతో ఈ న‌లుగురిలోఎవ‌రు పెద్ద హీరో అని నెటిజ‌న్లు చ‌ర్చ లేవదీశారు. 

 

మరిన్ని వార్తలు