హెరిటేజ్ స్టిక్కర్ చెరిగింది… రోజా సిగ్గు పోయింది.

red sandalwood smuggling in heritage van

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హెరిటేజ్ పాల వ్యాన్ లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారంటూ వైసీపీ నాయకురాలు రోజా టీడీపీ సర్కార్ మీద దుమ్మెత్తిపోసిన విషయం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే వుంది. అయితే ఆమెతో పాటు మొత్తం వైసీపీ కళ్ళు బైర్లు కమ్మే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. హెరిటేజ్ పాల వ్యాన్ లో ఎర్ర చందనం రవాణా చేసిన వారి అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది. పట్టుబడినవాళ్లు చెప్పిన కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు.

ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురి సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఆరుగురిలో ఒకరు రాజశేఖర్ అలియాస్ చిన్నా. ఇతగాడే పక్కా ప్లాన్ తో ఓ పాల వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలించాడు. మాములుగా అయితే పట్టుకుంటారని భావించి ఆ పాల వ్యాన్ కి హేరిటేజ్ స్టిక్కర్ అంటించిన ఘనుడు. ఇతనికి ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా ఒకప్పుడు సీఎం చంద్రబాబు మీద అలిపిరి వద్ద హత్యాయత్నం చేసిన కొల్లం గంగిరెడ్డి. ఈ గంగిరెడ్డి దగ్గర పనిచేసిన మహేష్ అనే అతనికి చిన్నా ప్రియశిష్యుడు, ఓ రోడ్ ప్రమాదంలో మహేష్ చనిపోవడంతో ఆ స్థానంలోకి వచ్చిన చిన్నా గంగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా మారాడు. ఇప్పుడు కూడా అన్న చెప్పడంతో హేరిటేజ్ స్టిక్కర్ అంటించినట్టు చిన్నా పోలీసులకి చెప్పాడు. ఆ అన్న గంగిరెడ్డి అని అతను వైసీపీ కి అనుకూలంగా కిందటి ఎన్నికల్లో ఏ స్థాయిలో పనిచేశాడో అందరికీ తెలుసు.

ఇదంతా ఒక ఎత్తు అయితే హేరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం అనగానే రోజమ్మ రెచ్చిపోయింది. వైసీపీ అనుకూల సోషల్ గంగవెర్రులెత్తింది. ఇప్పుడు పోలీసుల విచారణతోహేరిటేజ్ స్టిక్కర్ చెరిగింది. నాటి ఘటనని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన రోజమ్మకి సిగ్గు పోయింది. అందుకే కాబోలు ఓ మాట మాట్లాడే ముందు కాస్త ముందు వెనుక చూసుకోవాలని అనేది. రోజాతో పాటు నాడు రెచ్చిపోయిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా కూడా ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా ఆపసోపాలు పడుతోంది.

మరిన్ని వార్తలు

ఏపీ లో బీజేపీ ముక్కోణపు ప్రేమ కథ .

అందరూ ఆ స్కూల్లోనే చదువుకున్నారా..?

జగదీష్ రెడ్డికి అతి ఎక్కువైంది