ప్రభాస్‌కు ఎంత కష్టమొచ్చింది!

Bollywood model Heroine for Prabhas Sahoo Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన ప్రస్తుతం ప్రభాస్‌ నిల్చున్నాడు. ఆ కారణంగా ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఆ అంచనాను అందుకునేలా ‘సాహో’ చిత్రాన్ని దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రభాస్‌ కూడా చాలా కష్టపడి మరీ ఈ చిత్రం కోసం కొత్త లుక్‌ను ట్రై చేశాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘సాహో’ చిత్రంకు ఇంకా హీరోయిన్‌ ఎంపిక కాలేదు. 

ఎంతో మంది పేర్లు పరిశీలించారు, కొందరు భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తుండగా, మరి కొందరు ప్రభాస్‌కు సెట్‌ అవ్వడం లేదు. చివరకు అనుష్కను ఫైనల్‌ చేశారు అనే వార్తలు వచ్చాయి. కాని ఇంత వరకు సినిమాకు హీరోయిన్‌ ఫైనల్‌ కాలేదు అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఒక మోడల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా బుక్‌ చేశారనే టాక్‌ వినిపిస్తుంది. పలు యాడ్స్‌లో కనిపించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాల్లో అడపా దడపా కనిపిస్తూ వస్తుంది. ఎందరో స్టార్‌ హీరోయిన్స్‌ ఉండగా, ప్రభాస్‌ ఒక కొత్త హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయాల్సి వచ్చిందని ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ప్రభాస్‌కు ఎందుకు ఇలా జరుగుతుందని సినీ వర్గాల వారు కూడా విష్మయంకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు

రకుల్‌ కీలక ప్రకటన

దిల్‌రాజు రీ షూట్‌ ఫిదా చేసింది