రోజాది నోరా….లేక ?

roja use abusive words

వైసీపీ ఎమ్మెల్యే రోజాది ఎప్పుడూ వివాదాస్పద శైలే, సినీరంగం నుండి రాజకీయ రంగంలోకి వెళ్ళిన ఆమె ఎప్పుడూ నోరు తెరిచినా ఎదుటి వాళ్ళు భయంతో చెవులు మూసుకోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఆమె ఆవేశంగా ఒకరిని తిడుతున్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఒక పోలీసు అధికారిని తిడుతున్నట్టు, అది కూడా సభ్య సమాజం తలదించుకునేలా, రాయలేని విధంగా మాట్లాడటం చుసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ భాష అలాంటిది, ఒక బాధ్యాతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆమె మాట్లాడిన మాటలు అస్సలు సమర్ధనీయం కాదు. ఆ వీడియో మీరు కింద చూడవచ్చు.

 

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ అదే సమయంలో ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి నోటి నుండే వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా రావాలి. లేనిచో వోట్లేసి గెలిపించిన వారే ఇంటికి పంపే అవకాసం ఉంది. ఆమె ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంతకు ముందు అసెంబ్లీలో కూడా ఒక మహిళా ఎమ్మెల్యేని అదేవిధంగా మాట్లాడి కొన్ని సంజ్ఞలు చేసి అవమానించారు. ఇదొక్కటే కాక చంద్రబాబుని దూషించడం మొదలు అన్నీ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి సహా ఎవర్నయినా చట్ట సభల్లో నోటికొచ్చినట్లు తిట్టడానికే పదవి అనుకుంటారామె. ప్రజలు తిరస్కరించినా ఆమె తీరు మారడంలేదు. ప్రజల్లో పలచనైపోతున్నామని తెలిసి బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి, ఇంకా జుగుప్సాకరంగా వ్యవహరించడం ద్వారా సభ్య సమాజానికి రోజా ఏం సమాధానం ఇవ్వదలచుకుంటున్నట్టు? రాజకీయమంటే హుందాతనం. దురదృష్టవశాత్తూ రోజా లాంటివారి వల్ల రాజకీయాల్లో హుందాతనం కనుమరుగైపోతోంది అనడంలో ర్తువంటి సందేహం లేదు.

మరి ఇప్పటికైనా రోజా తన తీరు మార్చుకుంటారో లేక మరిన్ని వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలవాలని భావిస్తారో చూడాల్సి ఉంది.