ఫ్రెండ్షిప్ డే ఎలా ఏర్పడిందో తెలుసా ?

how friendship day formed

ఆగస్ట్ మొదటి ఆదివారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని తెలిసిందే. ఆ రోజు వచ్చిందంటే చాలు నైట్ 12 నుండే హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అనే మెసేజ్ ల వరద వస్తూనూ ఉంటుంది. ఇక వాట్సాప్ లో అయితే చెప్పవసరంలేదనుకుంటా. ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే బయట ఎవరూ ఫ్రెండ్స్ లేని వాడు కూడా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్టు బిల్డప్ పోస్ట్ లు పెడతారు. ఇలా ఈ రోజు మొత్తం Happy FriendShip Day అంటూ మోత మోగిస్తారు.

గ్రీటింగ్ కార్డులు ఇచ్చి, ఫ్రెండ్ షిప్ బాండ్లు ఇలా ఒకటేమిటి చాలా ఉంటాయ్ లేండి. ఇంతకీ అసలు ఫ్రెండ్ షిప్ డే ఎందుకు వచ్చిందో తెలుసా….? అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని శిక్షలో భాగంగా చంపింది. అతని మరణ వార్త విని ఆమరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా ప్రకటించినట్లు తెలుస్తోంది.