కాపుల విషయంలో మాట తప్పి మడమ తిప్పిన జగన్ !

jagan u turn on kapu reservation

కాపు రిజర్వేషన్లపై జ‌గ‌న్ మ‌రోసారి మాట మార్చారు. మాట తప్పను మడమ తిప్పను అనిరోజుకి ఒకసారి అయినా చెప్పుకొచ్చే జగన్ అందులో మాటే తప్పేదారు. మూడు రోజుల క్రితం పాద‌యాత్ర‌లో భాగంగా కాపు రిజ‌ర్వేష‌న్లు సాధ్యం కాద‌ని ఎందుకంటేరిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశమని..తాము ఏం చేయలేమని హామీలు ఇచ్చి చేయలేకపోయానని అనిపించుకొనని చేతులెత్తాశారాయన. ఆయ‌న‌..ఇప్పుడు మ‌రోసారి స్వ‌రం మార్చి కాపు రిజర్వేషన్లకు వైసీపీ మద్దతు ఇస్తుందని ప్ర‌క‌టించారు.

పాద‌యాత్ర‌లో భాగంగా మంగళవారం పిఠాపురంలో పర్యటించిన జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాపు రిజర్వేషన్లపై తన మాటలను వక్రీకరించారని,తాను కాపు రిజెర్వేషన్లకి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పుకోచ్చారు. సొంత పార్టీలోని కాపు వర్గ నేతలే జగన్ పాదయాత్రలో ముభావంగా ఉండటం, కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న జోన్ కావటం..కొద్ది మంది యువకులు రిజర్వేషన్లకు సంబంధించి ప్ల కార్డులు ప్రదర్శించటంతో జగన్ ఇలా మడమతిప్పారని చెప్పుకోవచ్చు.

అలాగే దేశం మొత్తమ్మీద జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని కానీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని..అందువల్లే తాను ఖచ్చితంగా హామీ ఇవ్వలేని పరిస్థితులు వచ్చినట్లు ప్రజలకు కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసే టీడీపీర్ సోషల్ మీడియా వింగ్ జగన్ ముందు మాట్లాడిన మాత, తర్వాతమార్చిన మాట పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు.