డబ్బు పెట్టి జబ్బులు కొనుక్కుంటున్నారా ?

benefits of copper bottles

పూర్వకాలంలో అంటే మన అమ్మమ్మల తరం,లో ఎక్కడికయినా బయటకి వెళితే అక్కడ ఏ ఇంటి ముందు ఆగి కాస్త దాహం తీర్చ‌మంటే… రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. ఇపుడు మనం ఒక 20 రూపాయలు పెట్టి కొనుక్కు తాగుతున్నాం అదీ మన ప్రాణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిళ్లలో, ఏదైనా హోటల్ కి భోజనానికో టిఫిన్ కో వెళితేఅక్కడ క‌నీస శుభ్ర‌మైన నీరు దొర‌క‌డం లేదు. అందుకే అంతా మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వ‌స్తోంది. ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ని కొని అవే మంచివని లీటర్ 4 రూపాయల నుండి 25 రూపాయలు వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ 20/- నీరు అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్‌లా అమ్ముతున్నారు. అంటే మనం డబ్బు పెట్టి మరీ జబ్బు కొనుక్కుంటున్నాం..దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. అసలు ఈమినరల్ వాటర్ ఎందుకు తాగుతున్నారంటే మరో మాట లేకుండా ఆరోగ్యం కోసం అంటారు అందరూ.

అలా రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే, రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఈవిషయం చాలామందికి తెలియదు. అయితే మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే నీటిని శుభ్రపరిచేందుకు ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ”రోబ్ రీడ్” అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా, ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు యాభై శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా, రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు. అందుకే ఈ మధ్య రాగి పాత్రల వాడకం ఎక్కువయ్యింది మీరు గమనించారో లేదో..

సో మిత్రులారా డబ్బులిచ్చి జబ్బులు కొనుక్కోవడం ఆపేయండి….మన పెద్దలబాటలో కాపర్ వస్తువులు వాడి ఆరోగ్యంగా ఉండండి.