విద్యా రంగంలో మరో అధ్యాయం… నారాయణ ఎన్ లెర్న్

Narayana launches Digital initiative N Learn App for students

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన వాటిలో ఒకటైన నారాయణ విద్యా సంస్థ డిజిటల్ విద్యా వ్యస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ తమ భోదనా పద్దతులు మార్చుకుంటూ నారాయణ ప్రతీ సారి విజయం సాధిస్తోంది. అందుకే ప్రత్యేకంగా నారాయణ విద్యార్ధుల కోసమే ఆ యాప్ ని విడుదల చేసారు. మనం విజయం సాధించాలంటే పాత కాలపు మూస పద్దతులని, బట్టీ పట్టే విధానాన్ని పక్కన పెట్టి వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా వెళితే మరిన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చు అనేది ఆ యాప్ తయారీ వెనకున్న ముఖ్య ఉద్దేశ్యంగా కనపడుతోంది. కాలేజీ విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన ఈ ఎన్ లర్నింగ్ యాప్ గురించి పరిశీలిస్తే ఇది పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్ధులకి ఎంతో ఉపయోగమని తేలింది.

మొత్తం ఈ యాప్‌ను మూడు విభాగాలుగా విభజించారు. అందులో ఒక భాగం నేర్చుకోవడానికి, మరో భాగం నేర్చుకున్నది ఎదుర్కోవడానికి పరీక్ష, ఇక మూడవది రాసిన పరీక్ష కరెక్ట్ చేసి ఆయా సబ్జెక్ట్ లలో ఎంత బాగా చదువుతున్నారు, లేదా ఎక్కడ వెనుకబడి ఉన్నారు అనేవి సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒక్క నేర్చుకోవడం తప్పింది మిగతాదంతా క్షణాల్లో జరిగే ప్రక్రియ. ఇక ఇవే కాక దేశంలోని ప్రముఖ అధ్యాపకులతో ఆన్‌లైన్‌లో మాస్టర్‌ క్లాసెస్‌ ఉండటం విద్యార్ధులకి వరం అనే చెప్పాలి ఎందుకంటే ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా అక్కడే ఆన్లైన్ పాటాలు వినే అవకాశం ఉంటుంది. ఇక ఇవేకాక వివిధ టాపిక్‌లకు అనుగుణంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 104 చాప్టర్‌లు, 500టాపిక్‌లను కవర్‌ చేయటం ద్వారా 50,000 ప్రశ్నలను అందుబాటులో ఉంచడమనేది అనితర సాధ్యం అనే చెప్పాలి ఇదంతా నారాయణ విజయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.