మరిన్ని రాష్ట్రాల్లో నారాయణ !

Narayana To Be Established In More States

దేశంలో దాదాపు 13 రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుండి ప్రొఫెషనల్ కాలేజీల దాకా అన్ని స్థాయిల్లో నారాయణ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. సుమారు 3 లక్షల మంది పిల్లలు నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఈ విద్యాసంస్థలు ఏర్పాటు అయి 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎన్ డిజిటల్ అనే యాప్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి రోజు సందర్భంగా నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సింధూర మరో విషయాన్ని ప్రకటించారు. ముందుగా 40 ఏళ్ల నారాయణ విద్యాసంస్థల ప్రస్థానాన్ని గురించి చెప్పిన ఆమె 2018 సంవత్సరం మర్చిపోలేని విజయాల్ని అందించిందని ఈ ఉత్సాహంతో మరింత ముందుకు వెళతామని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఎన్ డిజిటల్ అనేది విద్యారంగంలో ఒక రెవల్యూషన్ గా ఆమె అభివర్ణించారు. ఇక్కడితోనే ఆగక నారాయణ సంస్థ మరిన్ని రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలని ప్రారంభించనుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.