మొదటి రోజే మాజీమంత్రి నారాయణకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

jagan government gave shock to narayana

విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాల ప్రారంభం తొలిరోజునే మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థ కు షాక్ తగిలింది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గుర్తింపు లేని పాఠశాలల ఏరివేతకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ సత్యనారాయణ పురం లో ఉన్న నారాయణ స్కూల్ కు అనుమతులు లేవని గతంలో మూడు దఫాలుగా నోటీసులు జారీ చేశామని అయినా వారి వైఖరి మారకుండా తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీజ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. నారాయణ స్కూల్ సీజ్ చేయడంతో పాటుగా, లక్ష రూపాయలు జరిమానా విధించారు. అయితే నారాయణ స్కూల్ ఒక్కటే సీజ్ చేయటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ రంగంలో ఎవరు ఎలాంటి అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా ఎంతటి వారైనా సరే సహించేది లేదంటున్న జగన్ అనుమతుల్లేని మాజీ మంత్రి నారాయణకి చెందిన ఒక్క స్కూల్ ని మాత్రమే సీజ్ చేసారు. మాజీ మంత్రులు, టీడీపీ నేతలని టార్గెట్ చేస్తూ వైసీపీ పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.