రోజాకి కీలక పదవినిచ్చిన జగన్

jagan gave key position to roja

ఎట్టకేలకు కీలక పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తొమ్మిదేళ్లు జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచినా.. చివరికి పార్టీ గెలిచిన తర్వాత మంత్రి పదవి రాకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ప్రమాణస్వీకారం రోజు విజయవాడలో ఉండి.. ఆ తర్వాత నగరి వెళ్లిపోయారు. రోజా అసంతృప్తికి గురయిన విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికి నామినేటెడ్ పోస్ట్‌తో సరిపెట్టుకోమని సూచించారు. అదీ కూడా కీలకమైన పదవి ఇస్తామని చెప్పడంతో రోజా అంగీకరించారు. ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ పోస్ట్‌ను కేటాయించారు. నిజానికి ఓ రకంగా నామినేటెడ్ పదవుల్లో ఇది పెద్ద పదవి అని చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు భూముల కేటాయింపు దగ్గర్నుంచి మౌలిక సదుపాయాలు కల్పించడం వరకూ వివిధ సందర్భాల్లో ఏపీఐఐసీ కీలకపాత్ర పోషిస్తుంది.