పీసీ ఫ్యాన్స్‌కు బిగ్‌ బ్యాడ్‌ న్యూస్‌

Priyanka Chopra Goodbye to movies after Marriage

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పీసీ అలియాస్‌ ప్రియాంక చోప్రా త్వరలోనే హాలీవుడ్‌ యువ నటుడు నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు గత సంవత్సర కాలంగా చెట్టా పట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. కొందరు వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయ్యిందని చెబుతున్నారు. నవంబర్‌లో వీరిద్దరు అమెరికాలో వివాహం చేసుకుంటారని బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

బాలీవుడ్‌లో ఈమద్య ప్రియాంక చోప్రా కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏమీ లేవు. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసే పనిలో ఈ అమ్మడు ఉన్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లు చేసిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారిపోవాలని ఆశ పడుతుంది. అందుకు బాయ్‌ ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌ హెల్ప్‌ అవుతాడని ఆమె భావిస్తుంది. బాలీవుడ్‌లో కంటే హాలీవుడ్‌లో నటించడం వల్ల పారితోషికం, పబ్లిసిటీ అన్ని విధాలుగా డబుల్‌ త్రిబుల్‌ వచ్చే అవకాశం ఉందని, అందుకే బాలీవుడ్‌లో ఈమె నటించాలనుకోవడం లేదు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. హాలీవుడ్‌లో పీసీకి వరుసగా ఆఫర్లు వస్తాయా రావా అనే విషయం చూడాలి. ఒకవేళ అక్కడ ఆఫర్లు లేకుంటే మళ్లీ ఈమె బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి. ప్రియాంక చోప్రా హిందీ సినిమాలను వదిలేయడం అనేది ఆమె అభిమానులకు ఖచ్చితంగా బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పుకోవచ్చు.