అందరూ ఆ స్కూల్లోనే చదువుకున్నారా..?

Tollywood Stars In Drug Case Given Same Information In SIT Investigation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సాధారణ కేసుల్లోనే నిందితులకు లాయర్లు ఓ రేంజ్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసులో ప్రముఖులకు ఎలాంటి సలహాలు అందుతాయో వేరే చెప్పాల్సిన పనలేదు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అదే జరుగుతోంది. ప్రస్తుతం విచారణకు హాజరైన ముగ్గురు నిందితులకు ఓ లాయరే ట్రైనింగ్ ఇచ్చి ఉంటారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అందరి ఆన్సర్లు ఒకేలా ఉన్నాయట.

సిట్ విచారణకు పక్కా ట్రైనింగ్ తీసుకుని హాజరవుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా.. ఎక్కడా చిక్కకుండా జవాబులు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులకే విసుగు పుడుతోందట. సినీ సెలబ్రిటీల్ని వీలైనంత మైండ్ గేమ్ ఆడైనా సరే.. అసలు జవాబులు కక్కించాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే విచారణ గంటల తరబడి సాగుతుందన్న వాదన ఉంది.
మరోవైపు డ్రగ్స్ తీసుకోవడం కంటే అమ్మడమే పెద్ద నేరం. కానీ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎప్పుడో ఓసారి అంగీకరిస్తున్న సెలబ్రిటీలు.. అమ్మకాల పేరెత్తితే మాత్రం నై మాలూమ్ అని చెబుతున్నారు. అటు టెస్టుల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రూవ్ చేయొచ్చు కానీ.. డ్రగ్స్ అమ్మినట్లు తేల్చడం కష్టమే. కానీ సిట్ దగ్గర మాత్రం ఆధారాలున్నాయట. మరి ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడు బయటకు తీస్తారో..?

మరిన్ని వార్తలు:

హరిబాబుకు అదృష్ట యోగం పట్టినట్లే

సుబ్బరాజు సహకరించాడా.. లేదా..?