రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారా ?

Ys Jagan to Remove MLA Roja from Nagari Constituency

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా సెల్వ‌మ‌ణి ఆమెకి ముందు నుండి ఒక పేరును పెట్టి ప్రత్యర్ధి పార్టీలు విమర్శించేవి అలా అనడం తప్పయినా సరే ఆమె మీద ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారు అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఉన్న పార్టీ గెలిచినా ఆమె గెలవదు ఆమె గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు. చివరకి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైకాపాలో చేరి వైసీపీలో తానే వాగ్దాటి కలిగిన నాయకురాలు అనుకుని నోటిదురుసుగా ఏమి మాట్లాడుతుందో కూడా విచక్షణ లేనంతగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోసేది. గ‌త ఎన్నిక‌ల్లో సాధార‌ణ మెజార్టీతో గెలిచిన రోజా… వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రిప‌ద‌వి గ్యారంటీ అని ఆశించారు.

కానీ.. ఊహించిన విధంగా జ‌గ‌న్‌కు ఎదురైన ఝ‌ల‌క్‌తో ఆమెకు కూడా నిరాశే ఎదురైంది. పైగా… సినిమాల్లో సంపాదించిన సొత్తంతా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుచేయ‌టంతో ఇప్పుడు కేవ‌లం బుల్లితెర షోల‌తోనే నెగ్గుకు రావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కొద్దిరోజులుగా జ‌బ‌ర్ద‌స్త్‌లో కూడా క‌నిపించ‌ట‌లేదు దానికి కారణం సినిమా షూటంగ్‌లో బిజీగా ఉన్నానంటూ చెబుతున్నా… వాస్త‌వానికి ఆమెకు జ‌బ‌ర్ద‌స్త్‌తో ఎంత పాపులారిటీ వచ్చిందో అంతే మైనస్ ప్రజల్లోకి వెళ్ళింది. అందుకే ఆమె ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ట‌. ఇటీవలే తన నియోజకవర్గంలో కొత్త ఇల్లు కట్టించి అందులో గృహ ప్రవేశం కూడా చేశారు. అయితే ఇంతా చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుందా అంటే దానికి జగన్ చేతులు ఎత్తేశారట.

పీకీ అంతర్గతంగా చేసిన సర్వేలో కూడా రోజా నోటి దురుసు వల్ల పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని తేలడంతో ఇక వచ్చే సారి టికెట్ ఇవ్వకూడదని భావించినట్టు చర్చ జరుగుతోంది. నీ నోటి దురుసుతనం వల్ల‌నే పార్టీ ప‌రువు పోయిందంటూ కూడా మండిప‌డిన‌ట్లు పార్టీవ‌ర్గాల్లో అంతర్గతంగా సాగుతున్న చర్చ. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇటీవ‌ల ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణంతో న‌గ‌రిలో సెంటిమెంట్ ఆ ఫ్యామిలీకు సానుభూతి పెరిగింది. దీంతో ఇక్క‌డ ముద్దుకృష్ణ‌మ‌నాయుడు త‌న‌యుడు బ‌రిలోకి దిగే అవ‌కాశాల‌న్నాయి. దీంతో సెంటిమెంట్ వ‌ర్క‌వుట‌య్యే వీలుంద‌ని టీడీపీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే సీటు మీద హామీ లభించని రోజాకి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందట. పైగా న‌గ‌రి ప్ర‌జ‌లు కూడా రోజా అభివృద్ధి ఏమీ చేయ‌లేకపోయింద‌నే అభిప్రాయ ప‌డ‌తున్నారని సమాచారం. ఇక రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటో కాలమే నిర్ణయించాలి.