‘నా నువ్వే’ కూడా తుస్సేనా?

naa nuvve movie release date postponed over nela ticket movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కళ్యాణ్‌ రామ్‌ ఇటీవలే ‘ఎమ్మెల్యే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చాడు. ఏమాత్రం ఆకట్టుకోని ఆ సినిమాను కళ్యాణ్‌ రామ్‌ ఎందుకు చేశాడో అంటూ స్వయంగా నందమూరి అభిమానులు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కంటే ముందు కళ్యాణ్‌ రామ్‌ చేసిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా తాజాగా ‘నా నువ్వే’ అనే చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ చేశాడు. చూడబోతుంటే ఈ సినిమా కూడా తుస్సే అనేలా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘నా నువ్వే’ చిత్రాన్ని ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాని సినిమా విడుదలకు దగ్గర పడ్డ సమయంలో విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదే రోజున నేల టికెట్‌ విడుదల కాబోతున్న కారణంగా ఈ సినిమాను విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా వాయిదా వేయడం వల్ల నానువ్వే పై ప్రేక్షకుల్లో విశ్వాసం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జూన్‌ మొదటి వారంలో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. ఈ చిన్న పోటీని తట్టుకోలేక వాయిదా వేశారు అంటే, సినిమా ఖచ్చితంగా తుస్సుమనడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.