దేవర హైప్‌ పెంచిన కళ్యాణ్ రామ్ ట్వీట్!

దేవర హైప్‌ పెంచిన కళ్యాణ్ రామ్ ట్వీట్!
Cinema News

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి తారక్ గత గ్లోబల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో పాన్ ఇండియా లెవెల్లో దేవర పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే రానున్న కొన్ని రోజుల్లో దేవర గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని గట్టి టాక్ బాగా వినిపించింది. మరి ఇది సహా సినిమా షూట్ పై ఈ సినిమా నిర్మాత ఎన్టీఆర్ సోదరుడు టాలీవుడ్ హీరో అయినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమా “డెవిల్” రిలీజ్ సందర్భంగా చేస్తున్న ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు.

దేవర హైప్‌ పెంచిన కళ్యాణ్ రామ్ ట్వీట్!
Devara Movie

ఈ చిత్రం ఇప్పటివరకు షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యింది అని తాను కన్ఫర్మ్ చేసాడు. అలాగే దేవర గ్లింప్స్ తాలుకా వి ఎఫ్ ఎక్స్ పనులు తాము అనుకున్నట్టుగా కంప్లీట్ అయితే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని మరి ఎగ్జైటింగ్ అప్డేట్ ని అందించాడు. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ కి సిద్ధం చేశారు.