కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నకి బిక్కచచ్చిన విజయసాయి, మేకపాటి.

Bansal question to ysrcp mp's about on ap special status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈసారి పార్లమెంట్ సమావేశాల నాటికి ఏపీ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఆ పార్టీ అధినేత జగన్ చేసిన ఆర్భాటపు ప్రకటన తో ఇప్పుడు వస్తున్న చిక్కులు అన్నీఇన్నీ కావు. అప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు ఎవరికి గుర్తు ఉంటుందిలే అనుకుంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. అలా లోపలి వెళుతున్న విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి కి కాంగ్రెస్ ఎంపీ , మాజీ కేంద్ర మంత్రి బన్సల్ ఎదురుగా వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక వెళ్ళబోతున్న ఆ ఇద్దరినీ ఆపిన బన్సల్ ” ఔను మీరు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామన్నారు కదా… ఇంకా చేయలేదా ? ” అని ప్రశ్నించేసరికి ఇటు జగన్ కుడిభుజం విజయసాయి మోహంలో నెత్తుటి చుక్క కనపడలేదు. పాలిపోయిన మొహంతో ఆయన ఉంటే మేకపాటి కూడా ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వలేక బిక్కచచ్చిపోయారు.

అప్పటికీ బన్సల్ వదలకుండా అదే ప్రశ్న మీద రెట్టించడంతో ” మా నిర్ణయం మార్చుకున్నాం” అన్న మొక్కుబడి సమాధానం చెప్పారు వైసీపీ ఎంపీలు. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూ వుంటాయిలే అని బన్సల్ వారి గాయాలకు ఆయిట్మెంట్ పూసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒక్క బన్సల్ అడిగితేనే ఇంత ఇబ్బంది అనిపిస్తే ఇక పార్లమెంట్ లో టీడీపీ వాళ్ళు రోజూ ఇదే ప్రస్తావన తెస్తే ఏ సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఆ ఇద్దరు అక్కడ నుంచి కదిలి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు

డ్రగ్ మాఫియా ఆయన్ని టార్గెట్ చేసిందా ?

హెరిటేజ్ స్టిక్కర్ చెరిగింది… రోజా సిగ్గు పోయింది.

ఏపీ లో బీజేపీ ముక్కోణపు ప్రేమ కథ .