సిట్‌ను విసిగించిన సుబ్బరాజు

character artist subba raju irrtates SIt officers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖులు ఒక్కరొక్కరు సిట్‌ ముందు విచారణకు హాజరు అవుతున్న విషయం తెల్సిందే. మొదటగా పూరి జగన్నాధ్‌ సిట్‌ అధికారుల ముందుకు వెళ్లారు. సిట్‌ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారికి కావాల్సిన సమాచారంను ఇవ్వడం జరిగింది. పూరి వివరణ మరియు ఆయనతో విచారణ పట్ల సిట్‌ అధికాయి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడును విచారించిన అధికారులు తమకు రావాల్సిన ఇన్ఫర్మెషన్‌ను రాబట్టుకున్నారు. అయితే సుబ్బరాజు మాత్రం తీవ్రంగా విసిగించినట్లుగా తెలుస్తోంది. 

మొదటి రెండు గంటలు పొంతనలేని సమాధానలు చెప్పడంతో పాటు అర్థం పర్థం లేకుండా మాట్లాడి అందరిని విసిగించాడట. కొద్ది సమయం తనకు కళ్లు తిరుగుతున్నాయి అంటూ సిట్‌ అధికారులతో చెప్పాడు. దాంతో సిట్‌ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సుబ్బరాజు సరిగా సహకరించని కారణంగానే విచారణ చాలా ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. నేడు సిట్‌ ముందుకు తరుణ్‌ విచారణకు హాజరు అయ్యారు. మరి తరుణ్‌ విచారణకు సహకరిస్తాడా లేదా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

ప్రభాస్‌కు ఎంత కష్టమొచ్చింది!

దిల్‌రాజు రీ షూట్‌ ఫిదా చేసింది