మళ్ళీ తండ్రి అయిన ఎన్టీఆర్…

Jr NTR wife Lakshmi Pranathi gives Birth to Baby Boy again

మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టింది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్– లక్ష్మి ప్రణతికి మొదటి సంతానం అభయ్ రామ్ కాగా… రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని… అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రయ్యారు. ఆయన కుటుంబంలోకి మళ్లీ ఓ బుల్లి హీరో వచ్చి చేరాడు.

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురువారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘కుటుంబం పెరుగుతూ పెద్దదవుతోంది… కొడుకు పుట్టాడు’ అని తారక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల తండ్రయ్యారు. ఇదిలా ఉంటే, ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే 70,000 మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ఇందులో తన మొదటి పోస్ట్‌గా ‘అరవింద సమేత… వీర రాఘవ’ పోస్టర్‌ను పోస్ట్ చేశారు.