శ్రీ రెడ్డి కి సంజనకు పోలిక

Social media is comparing Sanjana with Sri Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది. మొదటి వారంలోనే షో ఎలా ఉండబోతుంది, పార్టిసిపెంట్స్‌ ఎలాంటి వారో క్లారిటీ వచ్చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఈసారి సామాన్యులకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆ సామాన్యుల్లో ఒక్క వ్యక్తిగా మోడల్‌ సంజన ఎంట్రీ ఇచ్చింది. సంజన ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి ఏదో ఒక వివాదంతో టాక్‌ ఆఫ్‌ ది హౌస్‌గా ఉంటూనే ఉంది. రెండు రోజులు జైల్లో తనను పెట్టడంతో బిగ్‌బాస్‌పైనే యుద్దం చేసిన సంజనను చూస్తుంటే శ్రీరెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుందంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. సంజన ప్రవర్తన మరియు శ్రీరెడ్డిల ప్రవర్తనలు సేమ్‌ టు సేమ్‌ ఉన్నాయంటూ వారు అంటున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌పై తన యుద్దం అంటూ ఉద్యమాన్ని మొదలు పెట్టింది. అది కాస్త హద్దులు పద్దులు లేకుండా, ఎటో వెళ్లిపోయింది. చివరకు పవన్‌ను టార్గెట్‌ చేసి వర్మ చెప్పిన వ్యాఖ్యలు చేయడంతో దుమారం పెద్దది అయ్యి, శ్రీరెడ్డికి అప్పటి వరకు మద్దతుగా నిలిచిన వారు కూడా వెనుదిరిగారు.

మొత్తానికి శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మోస్ట్‌ యాక్టివ్‌ మరియు వివాదాస్పద తారగా మిగిలి పోయింది. శ్రీరెడ్డి నానిపై గత కొంత కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు పీక్స్‌కు చేరుకున్నాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలు వల్గర్‌గా కూడా ఉన్నాయి. అయినా కూడా ఆమె తన పద్దతి మార్చుకోవడం లేదు.వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ సంజన చేస్తున్న వ్యాఖ్యలు ఆమె వ్యక్తిత్వంను తేల్చి పారేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఒక వ్యక్తి పక్కన లేని సమయంలో ఆ వ్యక్తి గురించి బ్యాడ్‌గా సంజ్ఞలు చేయడం, ఒక వ్యక్తి గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చేస్తుంది. ఆ కారణంగానే బిగ్‌బాస్‌ నుండి ఆమెను ప్రేక్షకులు మొదటి వారంలోనే పంపే అవకాశం ఉందని అంటున్నారు. మోడల్‌ అయిన సంజన కొన్ని వారాల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటే ఖచ్చితంగా మంచి ఆఫర్లు అనేవి వస్తాయి. ఆ విషయాన్ని ఆమె గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.