దండుపాళ్యం 2… తెలుగు బులెట్ రివ్యూ

dandupalya 2 Telugu Movie review and Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు :  పూజా గాంధీ, శృతి , సంజన , రవి శంకర్ , రవి కాలే 
దర్శకుడు :  శ్రీనివాస రాజ్ 
నిర్మాత :  వెంకట్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  అర్జున్  జన్య 

దండుపాళ్యం మొదటి భాగం కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తయారై 40 కోట్లు వసూలు చేసింది. అదే ఊపులో ఇప్పుడు దండుపాళ్యం 2 నిర్మించారు. తొలి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ నేరాలు చేసే విధానాన్ని , వారిని పట్టుకోడానికి పోలీసులు వేసిన పన్నాగాల్ని చూపించారు. తొలుత కన్నడ కే పరిమితం అనుకున్న సినిమా తెలుగు, తమిళ్ లోను హిట్ అయ్యింది. దీంతో రెండో పార్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని దండుపాళ్యం 2 అందుకుందో, లేదో చూద్దామా!

 Dandupalya 2 Story

ఎంతో మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న దండుపాళ్యం గ్యాంగ్ సభ్యులు చేసిన నేరాలకు ఉరి శిక్ష పడుతుంది. ఉరి శిక్ష అమలు కోసం ఎదురు చూస్తున్న ఆ ముఠా సభ్యులని కాపాడేందుకు ఓ జర్నలిస్ట్ ప్రయత్నిస్తాడు. కేసుల్లో వున్న కొన్ని లోపాల్ని అడ్డుపెట్టుకుని వారిని అమాయకులుగా నిర్దారించాలని ఆ విలేకరి ప్రయత్నాలు మొదలెట్టగానే పోలీసుల్లో కసి పుడుతుంది. జైల్లో వున్న దండుపాళ్యం ముఠా సభ్యుల్ని అక్కడి సిబ్బంది ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దండుపాళ్యం ముఠా సభ్యులకి ఏమైంది అన్నదే ఈ సినిమా కథ.

 Dandupalya 2 Analysis

దండుపాళ్యం 2 లో దర్శకుడు శ్రీనివాసరాజు సాధ్యమైనంతవరకు సినిమాటిక్ అంశాలకి దూరంగా ఉండాలని ట్రై చేసాడు. అయితే నటీనటుల ప్రతిభ, టెక్నిషియన్స్ టాలెంట్ తో అది పెద్ద లోపంగా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. దండుపాళ్యం ముఠా జైలు జీవితం, వారి కర్కశత్వం వెనుక వున్న మానసిక,సామాజిక కారణాల్ని వివరించే ప్రయత్నం చేస్తూనే మూడో సినిమాకి అవసరమైన వేదిక ఇర్మించేందుకు దర్శకుడు చేసిన ఎఫర్ట్ కనిపిస్తూనే వుంది. పూజ గాంధీ, మకరంద దేష్పాండే, రవి కాలే, రవి శంకర్, శృతి, సంజన తదితరులు తమ నటనతో సన్నివేశబలాన్ని పెంచారు. కేవలం గంట 45 నిమిషాల నిడివి మాత్రమే వున్న సినిమాలో నేర సామ్రాజ్యంలో చీకటి కోణాల్ని టచ్ చేసాడు దర్శకుడు శ్రీనివాస రాజు. అయితే ఈ కధకి సరైన ముగింపు ఇవ్వకుండా మూడో పార్ట్ కి లీడ్ చేసి వదిలిపెట్టడంతో క్లైమాక్స్ చప్పగా అయిపోయింది. అయితే క్రైమ్ ప్రధాన అంశంగా వున్న కధలో సామాజిక కోణాల్ని విశ్లేషించడం ఇందులో కొత్త పాయింట్ .

Dandupalya 2 Plus Points

నటీనటుల ప్రతిభ
సామాజిక విశ్లేషణ

Dandupalya 2 Minus Points

నాటకీయత లేకపోవడం .
మూడో భాగం మీద అధిక దృష్టి.

తెలుగు బులెట్ పంచ్ లైన్… ” దండుపాళ్యం 2 ” మూడు కోసం ట్రయల్ రన్

తెలుగు బులెట్ రేటింగ్ … 2 . 75 / 5 .