పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన సమంత

samantha clarifies about her marriage in an media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్‌ హీరోయిన్‌ సమంతలు అక్టోబర్‌ 6న వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అక్కినేని వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. గోవాలో పెళ్లిని ఒక చర్చ్‌లో భారీగా నిర్వహించి, ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోనున్నాను అని, ఆ తర్వాత 45 రోజుల పాటు అమెరికాకు హనీమూన్‌కు వెళ్లబోతున్నట్లుగా మీడియాలో వార్తలు పుంకాను పుంకాలుగా వచ్చాయి. 

మీడియాలో వస్తున్న వార్తలను సమంత కొట్టి పారేసింది. తమ పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, తమ పెళ్లి చాలా నిరాడంబరంగా జరుగనుందని, ఎలాంటి హంగామా లేకుండా గోవాలోని ఒక చర్చ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్య జరుగనుంది. పెళ్లి అయిన అయిదు రోజుల్లోనే మళ్లీ ఇద్దరం కూడా షూటింగ్స్‌తో బిజీ కానున్నట్లుగా సమంత పేర్కొంది. పెళ్లి గురించి భారీ ప్లాన్స్‌ ఏమీ లేవని సమంత చెప్పకనే చెప్పింది. అయితే ఇండస్ట్రీ వరకు అయినా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో అక్కినేని వారి రిసెప్షన్‌ ఉంటుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు

చిరు151 ఆసక్తికర వార్త