నంద్యాలలోజనసేన జెండా రెపరెపలు… వైసీపీలో గుబులు.

tdp leaders use Janasena Flags in Nandyal By poll elections campaign

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నిక ఎన్నో రాజకీయ చిత్రవిచిత్రాలకి వేదిక అవుతోంది. అక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య అయినా మిగతా పార్టీలు కూడా ఆ ఉప ఎన్నిక మీద ఎక్కడలేని ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ జాబితాలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన వున్నాయి. అయితే అవి పోటీ చేస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా జనసేన జెండాలు అక్కడ రెపరెపలాడుతున్నాయి. అధిష్టానం ఏమనుకుంటుందో తెలియకుండా జనసేన కార్యకర్తలే ఇలా జెండాలు ఎగరేస్తున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 2014 ఎన్నికల్లో తన మిత్రపక్షంగా వున్న జనసేన ఇప్పటికీ స్నేహితుడే అన్న భావనలో వున్నారో ఏమో గానీ చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలే తమ ప్రచారంలో జనసేన జెండా వుండేట్టుగా చూసుకుంటున్నారు. అయితే జనసేనతో కలిసి ఎన్నికలకు వెళదామనుకుంటున్న వామపక్షాలు ఈ పరిణామంతో ఇబ్బంది పడుతున్నాయి.

టీడీపీ ప్రచారపర్వంలో జనసేన జెండా రెపరెపలు మీద ఆ పార్టీ హైకమాండ్ మౌనంగా వున్నప్పుడు తాము నోరు తెరవడం సముచితం కాదని వామపక్ష నేతలు భావిస్తున్నారు. అటు జనసేన కార్యకర్తలకు కూడా ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కావడం లేదు. మొత్తంగా ప్రచార పర్వాన్ని చూస్తున్న వైసీపీ మాత్రం జనసేన జెండా రెపరెపలు చూసి గుబులు పడుతోంది. అయితే ఈ వ్యవహారం మీద నోరెత్తడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. 2019 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జనసేన తో కలిసి అడుగులు వేయాలనుకుంటున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లో జనసేన అంశాన్ని ప్రస్తావించవద్దని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారట. అదే సమయంలో జనసేన జెండా రెపరెపలు యువ ఓటరుని ప్రభావితం చేస్తాయన్న ఆందోళన కూడా లేకపోలేదు.

మరిన్ని వార్తలు

జగన్ ఆశల మీద కోట్ల నీళ్లు చల్లుతున్నాడు.

ఆ బామ్మ అహ నా పెళ్ళంట అంటే కేకో కేక .

వ్యసనాన్ని వదులుకోలేకపోతున్న నల్లారి