ముద్రగడ యాత్రపై పోలీస్ ఉక్కుపాదం.

DGP sambasiva rao comments on mudragada Padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేని యాత్రని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమని డీజీపీ సాంబశివరావు తేల్చి చెప్పారు. ఇందుకు గల కారణాలు, తీసుకున్న చర్యల గురించి వివరించారు. డీజీపీ ప్రకటనలోని బులెట్ పాయింట్స్ ఇవే.

  • రేపు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పర్మిషన్ లేదు.
  • ముద్రగడ పర్మిషన్ కావాలని ఎక్కడా అడగలేదు.
  • జిల్లా పరిధి దాడి జరిగే పాదయాత్ర కాబట్టి అనుమతికి ఇబ్బంది.
  • గత చరిత్ర బట్టే అనుమతులు ఇవ్వాల వద్దా అనేది నిర్థారణ.
  • గతేడాది బౌతిక దాడులు, ఆస్థి నష్టం, ప్రజలకు ఇబ్బంది, 60,70 కొట్ల ఆస్తి నష్టం జరిగింది.
  • 2009లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం కచ్చితంగా పర్మిషన్ తీసుకోవల్సిందే.
  • అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవు.
  • 26న లే సీజ్ అనే కార్యక్రమం పెట్టారు. దానికి బెదిరేది లేదు.
  • సెక్షన్ 30, 144 ప్రకారం సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు.
  • చట్ట వ్యతిరేక యాత్రలో కాపు, దళిత యువత యాత్రలో పాల్గొన కూడదని మనవి.
  • ఏ నేరం రేపు జరిగినా…ఆస్థినష్టం జరిగినా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
  • సెంట్రల్ కు సంబంధించిన ఆస్తులు ధ్వంసం జరిగినా తీవ్రపరిణామాలు‌.
  • మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, మాకు అందరు సమానమే.
  • చట్టం వ్యతిరేక చర్యలకు మా బాధ్యత మేం నిర్వహిస్తాం.
  • ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు జరిగాయని తెలుస్తోంది.
  • కోస్తా ప్రాంతంలో రెండు ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ పని చేస్తున్నాయి.
  • అమరావతి, గుంటూరులో కూడా భారీ బందోబస్తు చేసాం.

మరిన్ని వార్తలు

జగన్ ఆశల మీద కోట్ల నీళ్లు చల్లుతున్నాడు.

నంద్యాలలోజనసేన జెండా రెపరెపలు… వైసీపీలో గుబులు.

బంగారం మీద మోజున్న బాబా