కాంతారా చాప్టర్ 1 టీజర్ అద్భుతం!

కాంతారా చాప్టర్ 1 టీజర్ అద్భుతం!
Cinema News

కాంతారా చాప్టర్ 1 సినిమాపై బిగ్ అప్డేట్‌ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్‌ లుక్‌తో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌. నిన్న ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని ఆనెగుడ్డె ఆలయంలో చిత్ర బృందం ‘కాంతారా చాప్టర్ 1’ చిత్రం మొదటి పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా తెలుగుకి సంబంధించిన టీజర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

కదంబ కాలం నాటి కథతో కాంతారా చాఫ్టర్‌ 1 సినిమా ఉంటుందని చిత్రబృందం టీజర్‌లో తెలియచేసారు . పోస్టర్స్‌ లో, టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్‌ మాత్రం అదిరిపోయింది. తన ఇంటెన్స్‌ లుక్‌తో అందరినీ భయపెట్టాడు ట్యాలెంటెడ్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గంతో ఒక బావిలో నిలబడి కనిపించాడు రిషబ్‌ శెట్టి. ఇక కన్నడతో పాటు ఏడు భాషల్లో టీజర్ అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్‌లో మీకు నచ్చిన భాషలో టీజర్‌ని చూడవచ్చు. కాగా కాంతారా సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

కాంతారా చాప్టర్ 1 టీజర్ అద్భుతం!
Kantara Chapter -1

తొలుత కేవలం కన్నడ భాషలోనే రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో డబ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు కాంతారా ఛాప్టర్‌ 1 చిత్రం కేవలం కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

టీజర్ ని మీరు కూడా ఒక లుక్ వేయండి 

video : https://youtu.be/Frp0zC4643U