ఏపీ ప్రజలకు శుభవార్త… 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ ఆరోగ్య సిబ్బంది

Good news for people of AP… Health personnel for every household from 1st
Good news for people of AP… Health personnel for every household from 1st

ఏపీ ప్రజలకు శుభవార్త . ప్రతి ఇంటికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరోగ్య సిబ్బంది రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్ల మంది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను జగన్ సర్కార్ అందిస్తోంది. అయితే ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై విశృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇతర అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ప్రతి ఇంటిలో ఆరోగ్యశ్రీ సేవలపై సవివరంగా రూపొందించిన బ్రోచర్స్ అందజేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య మరియు ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ కింద సులువుగా మరియు ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరిస్తారు.

తాము ఉంటున్న ప్రాంతానికి చేరువలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు మరియు ఆయా ఆసుపత్రులలో అందే వైద్య సేవల గురించి అధికారులు చెబుతారు. సేవలు వినియోగించుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తిన మరియు సంతృప్త కర స్థాయిలో సేవలు అందకపోయినా 104 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయడంతో పాటు ఎలా ఫిర్యాదు చేయాలని వివరిస్తారు. ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే 14400 ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేసేలా అధికారులు ప్రజలను చైతన్యం చేయనున్నారు.