Election Updates: ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్

Election Updates: Polling in these constituencies till 4 pm
Election Updates: Polling in these constituencies till 4 pm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4గంటల సమయానికి పోలింగ్ ముగియనుంది.

అశ్వరావు పేట, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాల పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్త గూడెం, భద్రాచలం నియోజకవర్గం ఈ జాబితాలో ఉన్నాయి. పోలింగ్ మూగిసే సమయానికి క్యూలో ఉన్న వారు మాత్రమే ఓటు వేయవచ్చును. 4గంటలు దాటిందంటే ఎవరిని కూడా ఓటు వేసేందుకు అనుమతించరు.