దేవర: యన్టీఆర్ ఒక కొత్త లుక్ లో..!

Devara: ntr in a new look
Devara: ntr in a new look

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ మూవీ దేవర కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ కొరటాల కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గా అందులోని హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కుతుండడంతో ఈ మూవీ ఎన్టీఆర్ ని కాస్తా మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చేసింది.

దీనితో భారీ హైప్ దీనిపై నెలకొనగా ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రిపేర్ చేస్తున్న మేకోవర్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇది వరకు దేవర లో ఒక లుక్ ను చూపించిన మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ డేట్ తో ఒక యంగ్ లుక్ ని కూడా రివీల్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ తారక్ అయితే ఆశ్చర్య పరుస్తున్నాడు అని చెప్పాలి.

Devara: ntr in a new look
Devara: ntr in a new look

అలా లేటెస్ట్ గా ఎన్టీఆర్ నుంచి వచ్చిన తాజా లుక్ అయితే అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. నిన్న బెంగళూరికి ప్రైవేట్ పార్టీ నిమిత్తం బయలుదేరిన తారక్ కొన్ని ఫోటోలు బయటకి రాగ అందులో చాలా స్టైలిష్ అండ్ డైనమిక్ గా కనిపించి తారక్ అదరగొట్టాడు. దీనితో దేవర లో యంగ్ వెర్షన్ ఎన్టీఆర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని బాగా అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.