కాంతార 2 లో ఊహించని మలుపులు

కాంతార 2 లో ఊహించని మలుపులు
Cinema News

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన చిత్రం “కాంతారకన్నడ సహా తెలుగు మరియు హిందీ భాషల్లో అయితే ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఈ మూవీ భారీ విజయం తర్వాత మేకర్స్ దీనికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేయడంతో మరిన్ని అంచనాలు ను నెలకొన్నాయి. అయితే పార్ట్ 2 కాంతార కి సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఉంటుంది అని మనకి తెలిసిందే.

కాంతార 2 లో  ఊహించని మలుపులు
Kantara-2

మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై అయితే ఇపుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ సినిమా అయితే ఈ నవంబర్ 27న ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ కానుండగా ఈ డిసెంబర్ నుంచి అయితే రెగ్యులర్ షూట్ ఉంటుంది అంట . అలాగే ఈ మూవీ సెటప్ 300-400 ఎడి సమయంలో ఉంటుందట. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని 100 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్ లోకి మారగా అది కూడా వైరల్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.