ట్రైలర్‌ రివ్యూ : మాస్‌ బాలకృష్ణుడు

Posted November 11, 2017 at 13:06 

Balakrishnudu Movie Theatrical Trailer

నారా రోహిత్‌ చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కావడం లేదు. సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న నారా రోహిత్‌ తాజాగా చేసిన మరో ప్రయత్నం బాలకృష్ణుడు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించడంతో పాటు, గత చిత్రాలతో పోల్చితే చాలా వైవిధ్యంగా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి చెబుతున్నారు. ఒక పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చిత్ర దర్శకుడు ఇటీవలే చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. సమంత, రాశిఖన్నా, సాయి ధరమ్‌ తేజ్‌ ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్‌ చూస్తుంటే సినిమా పూర్తి స్థాయి మాస్‌, యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అనిపిస్తుంది. సరదాగా సాగిపోయే స్క్రీన్‌ప్లేతో ఒక సీరియస్‌ యాక్షన్‌ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. కమెడియన్‌ పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌ ఇంకా పలువురు కమెడియన్స్‌ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీజర్‌లో చూస్తుంటే ఒక రొటీన్‌ ఫ్యాక్షన్‌ స్క్రీన్‌ప్లేతో, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా తెరకెక్కిందని అనిపిస్తుంది. సినిమాలో ఇదే స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటే ఖచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ట్రైలర్‌ విడుదల తర్వాత సినీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. మరి ఈ సినిమాతో అయినా నారా రోహిత్‌కు కమర్షియల్‌ బ్రేక్‌ దక్కుతుందేమో చూడాలి.

SHARE