ఫొటోటాక్‌ : ‘హౌరాబ్రిడ్జ్‌’లో అదిరిన రొమాన్స్‌

director-rewon-yadu-about-howrah-bridge-movie-romance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో రూపొందుతున్న ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి పోయాయి. విడుదలైన రెండు టీజర్‌లు యూత్‌ను మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ రొమాంటిక్‌ స్టిల్‌ యూత్‌ ఆడియన్స్‌కు తెగ నచ్చేస్తోంది.

Howrah-Bridge-movie-romance

ఇప్పటి వరకు యూట్యూబ్‌లో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకున్న ఛాందిని చౌదరి ఈ చిత్రంలో చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని, హీరో హీరోయిన్‌ మద్య ఉండే రొమాంటిక్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు యాదు మాట్లాడుతూ..

rahul-and-ravindran

యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాు సినిమాలో చాలా ఉన్నాయని, ముఖ్యంగా హీరో హీరోయిన్‌ మద్య లవ్‌ మరియు రొమాంటిక్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇబ్బంది పడే విధంగా కాకుండా ఆరోగ్యవంతమైన రొమాంటిక్‌ లవ్‌ సీన్స్‌ సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత అంటున్నారు. ఈ చిత్రంతో హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌, హీరోయిన్‌గా ఛాందిని చౌదరి సెటిల్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు జోస్యం చెబుతున్నారు.