పూనం అన్న అజ్ఞాతవాసి అతనేనా ? అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళాడా ?

poonam kaur shocking tweets on pawan kalyan and trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొద్ది రోజులుగా తన ట్వీట్లతో నటి పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ దర్శకుడిని, అలాగే పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పూనమ్…గతంలో చేసిన ట్వీట్లు పెను దుమారం రేపాయి. తన సినిమాలలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు నిరాశ పరిచాడని అవకాశం ఇవ్వకుండా తనను మోసం చేశాడని ఆరోపించిన ఆమె ఓ ప్లాప్ హీరోయిన్ కు ఆ దర్శకుడు తన సినిమాల్లో పదే పదే అవకాశాలు ఇచ్చాడని త్వీట్ లు చేసింది. తాజాగా మరోసారి పూనమ్ ఓ దర్శకుడిని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేసింది.` `జల్సాలలో ఉంటూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు జాగ్రత్త…# నమ్మకద్రోహి“ అంటూ పూనమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే హీరోయిన్గా నటించినా చిన్నా చితకా వేషాలు వేసినా రాని పేరును పూనంకౌర్  పవన్ కళ్యాణ్అని  కత్తి మహేష్ ఎప్పుడైతే లింక్ కలిపి ఆరోపణలు చేసాడో అప్పటి నుండి ఆమె కూడా సెలబ్రిటీ అయిపొయింది. పూనంకు..

పవన్ కల్యామ్ మరో దర్శకుడితో కలిసి అన్యాయం చేశారని.. అందుకు బాధపడి ఆమె.. ఆత్మహత్యాయత్నం కూడా చేశారని ఆరోపించారు. ఏమేమి పైరవీలు జరిగాయో అప్పటికి అయితే ఆ వివాదం సద్దుమణిగింది కానీ… ఆ ఆరోపణలపై క్లారిటీ మాత్రం రాలేదు. కానీ అప్పుడప్పుడూ ట్వీట్ల ద్వారా పూనంకౌర్ మెరుపు దాడులు చేస్తూ ఉంటారు. అది పవన్, త్రివిక్రమ్ మీదనే అని సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తుంటాయి. కొద్ది రోజుల కిందట ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన ఆమె టాలీవుడ్‌లో తనకు చేదు జ్ఞాపకాలే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చింది. తనను నమ్మించి మోసం చేసిన వారిని వదిలి పెట్టబోనని పగ తీర్చుకుంటానని చెప్పింది.

అయితే ఈసారి ఆమె ఎటాక్ చేసింది పవన్ మీదనా, లేక త్రివిక్రమ్ మీదనా అనే చర్చ కూడా సోషల్ మీడియా లో సాగుతుంది. కొందరు అయితే పవన్ పూనం ల మధ్య మళ్ళీ ఏమైనా గొడవలు జరిగాయేమోనని అందుకే పైకి తన భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి అని చెబుతున్నా చాలా సిల్లీగా అనిపిస్తోందని వారి మధ్య వాగావడం జరిగి ఉంటుందని పవన్ దిస్తుర్బ్ అయ్యినందుకే ఇలా చంద్రబాబు మీదకు నింద నెట్టేసి పవన్ రెస్ట్ తీసుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం పవన్ నటించిన సినిమాలని కేవలం రిఫరెన్స్ కోసమే వాడి ఉంటారని ఆమె టార్గెట్ చేసింది త్రివిక్రమ్ నేనని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ముందు జల్సా సినిమాలో ఎన్నారై పార్వతీ మెల్టన్ కి చాన్స్ ఇచ్చినట్టే అజ్ఞాతవాసి సినిమాలో కూడా ఎన్నారై అయిన అను ఇమ్మాన్యుయేల్ కు త్రివిక్రమ్ చాన్స్ ఇచ్చాడని పార్వతీ లాగే ఆమెకు కూడా పెద్ద హిట్ లు లేవనే లాజిక్ నెటిజన్లు తీస్తున్నారు. అయితే త్రివిక్రమ్ పూనమ్ ల మధ్య అసలు గొడవ ఏమిటని…ఈ `అజ్ఞాత` ట్వీట్లకు బ్రేక్ ఎపుడు పడుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమయినా ఇలా పేర్లు మెన్షన్ చేయకుండా చేస్తున్న ఆమె ట్వీట్లు పవన్ అభిమానులకి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి అని అర్ధం అవుతోంది,.