అధికారికం : నవంబర్‌ నుండి షురూ

Koratala Siva Chiranjeevi movie shooting starts on November

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘భరత్‌ అనే నేను’ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ తదుపరి సినిమా చిరంజీవితో అంటూ ఇప్పటికే ఖరారు అయ్యింది. కొన్ని నెలల క్రితం పవన్‌ కళ్యాణ్‌ కోసం కొరటాల సిద్దం చేసిన కథను చిరంజీవితో చేస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా మంచి కథను మిస్‌ చేయవద్దనే ఉద్దేశ్యంతో స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి ఆ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం ఎక్కువ డేట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే కొరటాల శివతో ఇప్పట్లో సినిమా ఉండదని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఇప్పట్లో వీరిద్దరి కాంబో సినిమా లేదని తేలిపోయింది. అయితే ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

మెగా సన్నిహితుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ అక్టోబర్‌లో పూర్తి కానుంది. దాంతో కొరటాలకు నవంబర్‌ నుండి చిరంజీవి డేట్లు కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి సైరా విడుదల కానుండగా, నవంబర్‌లో ప్రారంభం అయ్యే కొరటాల, చిరంజీవి మూవీ సమ్మర్‌ కానుకగా విడుదల కాబోతుంది. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. భరత్‌ అనే నేను చిత్రం విడుదలై సంవత్సరం పూర్తి కాకముందే చిరంజీవితో చేసిన సినిమాను విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అందుకే నవంబర్‌ నుండే డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబో ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.