చరణ్‌ కోరినట్లు బాబాయి అడిగేనా?

I Am Ready To Campaign For Janasena If Pawan Kalyan Ask Says Ram Charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌ మరోసారి తన బాబాయి వెనక ఉంటానంటూ ప్రకటించాడు. గతంలోనే బాబాయి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను మరియు తన ఫ్యామిలీ కట్టుబడి ఉంటుందని, ఆయనకు రాజకీయాల్లో ఏ అవసరం వచ్చినా కూడా తామంతా ఉంటామని చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో పవన్‌ చాలా బిజీగా ఉన్న ఈ సమయంలో రామ్‌ చరణ్‌ చేసిన ప్రకటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ బాబాయి ఏ పని చెప్పినా చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. అంటే బాబాయి కోరితే జనసేన తరపున ప్రచారంకు సిద్దం అంటూ చరణ్‌ బహిరంగంగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌లు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు కూడా జనసేన కోసం తాను ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు.

2019 ఎన్నికల్లో ఏపీలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీలో హంగ్‌ ఏర్పడితే పవన్‌ చక్రం తిప్పాలని భావిస్తున్నాడు. అందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రజల నుండి ఓట్లు రావాలి అంటే అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు సినిమా వారిని రంగంలోకి దించుతారు. అయితే సినిమా స్టార్‌ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాడు. కనుక భారీ ఎత్తున క్యాంపెయినింగ్‌కు సినిమా వారు రావడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో రామ్‌ చరణ్‌ ప్రచారంకు తాను సిద్దం అంటూ ప్రకటించిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ మరియు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో రామ్‌ చరణ్‌ ప్రకటన చర్చనీయాంశం అయ్యింది. ఒక వేళ జనసేన పార్టీకి రామ్‌ చరణ్‌ ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని, నిప్పుకు ఉప్పు తోడైనట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి చరణ్‌ సేవలను పవన్‌ వినియోగించుకుంటాడా లేదా అనేది చూడాలి.