హైద‌రాబాద్ కు పాకిన నిఫా వైర‌స్?

Nipah Virus in Hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేర‌ళ వైర‌స్ ను వ‌ణికిస్తున్న నిఫా వైర‌స్ హైద‌రాబాద్ కు పాకిన‌ట్టు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ప్ర‌భుత్వం దీన్ని ధృవీక‌రించ‌లేదు. హైద‌రాబాద్ కు చెందిన వ్య‌క్తి ఒక‌రు ఇటీవ‌ల కేర‌ళ వెళ్లివ‌చ్చారు. అత‌నితో పాటు మ‌రో వ్య‌క్తికి నిఫా వైర‌స్ సోకిన‌ట్టు డాక్ట‌ర్లు అనుమానిస్తున్నారు. నిర్ధార‌ణ కోసం వీరి ర‌క్త‌న‌మూనాల‌ను పూణెలో ఉన్న నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపించిన‌ట్టు తెలంగాణ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ కే ర‌మేశ్ రెడ్డి వెల్ల‌డించారు. కేర‌ళ‌లో నిఫా వైర‌స్ సోకిన‌ట్టు నిర్ధారించింది ఈ సంస్థే. తాము ఇప్ప‌టికే కేర‌ళ‌లో నిఫా వైర‌స్ రోగుల‌కు చికిత్స అందిస్తున్న నేష‌న‌ల్ సెంట్ర‌ల్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అధికారుల‌తో చ‌ర్చించామ‌ని రమేశ్ రెడ్డి తెలిపారు.

నిఫా వైర‌స్ సోకిన‌ట్టు అనుమానిస్తున్న వ్య‌క్తి కేర‌ళకు వెళ్లివ‌చ్చాడ‌ని, అయితే వైర‌స్ ఉన్న ప్రాంతానికి ఆయ‌న చాలా దూరంలోనే ఉన్నాడ‌ని చెప్పారు. వ్యాధి నిర్ధార‌ణ‌కే రక్త‌న‌మూనాలు తీసుకున్నామ‌ని, అయితే పాజిటివ్ గా తేలే అవ‌కాశం త‌క్కువేన‌ని, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. హాస్పిట‌ల్ లో డాక్ట‌ర్ల కోసం ప్రొటెక్టివ్ సూట్ల‌ను సిద్ధంచేస్తున్నామ‌న్నారు. ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి ఏర్ప‌డితే ఎదుర్కోడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామ‌న్నారు. వైర‌స్ పై గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు ఎన్జీవో సంస్థ‌లు ప్ర‌చారం చేయాల‌ని కోరారు. చెట్ల నుంచి రాలిప‌డిన‌, ప‌క్షులు కొరిక‌న పండ్లు తిన‌కుండా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.