మళ్లీ రూటు మార్చుతున్న బన్నీ…!

Allu Arjun Confirmed Next Movie With Director Trivikram

కెరియర్‌ మొదట్లో యూత్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ ఆ తర్వాత మాస్‌ ఆడియెన్స్‌ను మెప్పించే దిశగా ప్రయాణం చేస్తున్నాడు. ‘సరైనోడు’ వంటి సక్సెస్‌ను మళ్లీ రిపీట్‌ చేయాలని బన్నీ తెగ ఆరాటపడుతున్నాడు. కానీ మాస్‌ సినిమాలతో వస్తున్న బన్నీపై యూత్‌ పెద్దగా ఫోకస్‌ చేయడం లేదు. యూత్‌ఫుల్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యంగ్‌ హీరోలు మంచి సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డ బన్నీ మళ్లీ రూటు మార్చాలని డిసైడ్‌ అయ్యాడట.

Vempalli Gangadhar Sensational Comments On Aravindha Sametha Movie

ఇదివరకు లాగే ఇప్పుడు కూడా యూత్‌ను అలరించే విధంగా సినిమాలని చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు కూడా ఇదే మాట చెబుతున్నాడు. అది ప్రయోగం అయినా కూడా యూత్‌ఫుల్‌గా ఉండాలని చెబుతున్నాడట. స్టయిలిష్‌ స్టార్‌గా భారీ లేడి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బన్నీ ఈ సారి యూత్‌ఫుల్‌ కథతో వస్తే ఇక మిగతా యంగ్‌హీరోలకు గట్టి షాక్‌ ఇవ్వడం ఖాయం. బన్నీ తదుపరి చిత్రాన్ని ఈ విధంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. బన్నీ త్వరలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నాడు.

Allu Arjun and Trivikram Srinivas combo again