కొత్త సీబీఐ డైరెక్టర్ కూడా అవినీతికి నెంబర్ వన్…!

Alok Verma Removed As CBI Director By High Powered Committee

సీబీఐలో గంట గంటకు పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించగా ఆయన వెంటనే చార్జ్ తీసుకున్నారు. అయితే తమను బలవంతంగా సెలవుపై పంపడాన్ని చాలెంజ్‌ చేస్తే సీబీఐ ఇప్పటి డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ తరపున లాయర్ ప్రశాంతభూషణ్ పిటిషన్ వేశారు.

Govt-Order-Sending-Him-On-L
అదే సమయంలో మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌గా నియమించడంపైనా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర అభ్యంతరం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీబీఐ కి డైరక్టర్ గా పని చేస్తున్న ఈ మన్నెం నాగేశ్వరరావుపై ఉన్న అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆయన చేతుల్లోకి వెళ్లిన ఏ ఒక్క కేసూ తేలింది లేదు. అన్నీ వట్టిపోయాయి.
మన్నెం నాగేశ్వరరావు ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని సంచలనం సృష్టించిన కుంభకోణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు.. మీడియా వర్గాలు సాక్ష్యాలతో సహా బయటపెట్టాయి. అంతేనా.. ఆయన ఒడిషా పోలీసు శాఖలో పని చేసినప్పుడు… అక్కడ అగ్నిమాపక సిబ్బంది దుస్తుల కోనుగోళ్లను అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపుగా రూ. మూడు కోట్ల రూపాయల లావాదేవీల్లో అక్కడి మరో పోలీసు అధికారితో బహిరంగంగా గొడవపడి.. చరిత్ర సృష్టించారు కూడా. ఇలాంటి సిన్సియర్ అధికారి ఇప్పుడు సీబీఐకి డైరక్టర్ గా ఎదిగిపోయారు.

Alok-Verma
ఇప్పటివరకు జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును తొలగించాలని అలోక్‌ వర్మ గతంలో సిఫార్సు కూడా చేశారని తెలుస్తోంది. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానాను రక్షించేందుకే అలోక్‌ వర్మను కూడా సెలవు మీద పంపారని గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్‌ అలోక్‌వర్మ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని అలాంటి నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని తెలుస్తోంది.