వర్మకు అంత సీన్‌ ఉందా…?

Ram Gopal Varma Lakshmi's NTR Biopic Controversy

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ సంచలనం చేయాలని ఫిక్స్‌ అవుతాడు. ఊరంతా ఓ దారి అయితే ఉలికి పిట్ట ఓ దారి అన్నట్టు అందరికి భిన్నంగా వర్మ ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ కాంట్రవర్శియల్‌గా ఉండే వర్మ తాజాగా ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అయితే గతంలో వర్మ ఇలాంటివి చాలా ప్రకటించాడు. కానీ వాటిని పట్టాలెక్కించే ప్రయత్నమే చేయలేదు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తా అని కూడా ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. తాజాగా క్రిష్‌ లక్ష్మిపార్వతి చాప్టర్‌ లేకుండా ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాను ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు.

ram-gopal-varma

‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రంతో ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’ను విడుదల చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన వర్మ ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం లేదు. దాంతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అసంభవం అంటూ సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో చంద్రబాబు, బాలయ్యలు పెద్ద శక్తు, కాబట్టి వర్మ ‘లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌’తో ఈ బలమైన వ్యక్తులకు ఎదురు వెళతాడు అనేది సందేహమే. అంతేకాకుండా గతంలో వర్మ చాలా ప్రాజెక్ట్‌లను కూడా ఇలా చేశాడు. ఇకపోతే ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టిన కూడా అందులో చంద్రబాబు, బాలయ్యలకు వ్యతిరేకంగా చూపించడం అనేది సందేహమే. వీరికి ఎదురు వెళ్లేంత సీన్‌ వర్మకు లేదు అంటూ బాలయ్య అభిమానులు అంటున్నారు.

Ram Gopal Varma Sensational Comments About NTR Biopic