బాబు , రామోజీని ఢీకొడతావా వర్మ ?

Lakshmi's NTR biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా తీస్తానని ప్రకటించిన వారంలోపే సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేసారు వర్మ. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మొదలెట్టి “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” దగ్గర ఫిక్స్ అయిపోయాడు వర్మ. ఎవెరెన్ని చెప్పినా ఈ సినిమా చేసి తీరతామని కూడా వర్మ. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం, ఆ తర్వాత పరిణామాల మీదే వర్మ ఈ సినిమాలో ఫోకస్ చేయబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ని గద్దె దించిన వైస్రాయ్ ఎపిసోడ్ ఈ సినిమాకి సెంట్రల్ పాయింట్ అయ్యే అవకాశం వుంది.

వైస్రాయ్ ఎపిసోడ్ ని వర్మ టచ్ చేసాడంటే దాంతో సంబంధమున్న మరికొన్ని అంశాల్ని కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. వైస్రాయ్ ఎపిసోడ్ సమయంలో అక్కడ జరిగిన ఘటనలు ఎలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అంతటి మహానుభావుడిని తట్టుకుని చంద్రబాబుని జనాల్లో నిలబెట్టడానికి అప్పుడు పత్రికల్లో వచ్చిన కధనాలది కూడా కీలక పాత్ర. ఈనాడు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా ప్రజాభీష్టాన్ని మలచడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వున్నాయి. వైస్రాయ్ లో బాబు క్యాంపు లో వున్న ఎమ్మెల్యేల సంఖ్యని ఈనాడులో పెంచి చూపారని ప్రధానం గా వచ్చిన ఆరోపణ. ఈ విషయంలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి చేసిన ఆరోపణలు ఉండనే వున్నాయి.

వంగవీటి, రక్తచరిత్ర చిత్రాల్లో వర్మ కీలకమైన, వివాదాస్పదమైన పాయింట్స్ ని డిప్లొమాటిక్ గా జనం ఆలోచనకే వదిలేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ వైస్రాయ్ ఎపిసోడ్ ని టచ్ చేస్తే నిజానికి ఈనాడు, రామోజీ పాత్ర గురించి కూడా ప్రస్తావించాలి. కానీ వర్మ అంత ధైర్యం చేస్తాడా అన్నదే ఆసక్తికరమైన అంశం. ఇక రాజకీయంగా ఎన్టీఆర్ ని ఢీకొట్టిన సూపర్ స్టార్ కృష్ణ ఆయన్ని టార్గెట్ చేస్తూ చాలా సినిమాలు తీశారు. కానీ చంద్రబాబు కి ఆ పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తున్న వర్మ తప్పనిసరిగా బాబు పాత్ర ని టచ్ చేయాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ,రాజకీయ మీడియా దిగ్గజాల్ని ఢీకొంటూ సినిమా తీయాల్సి రావడం నిజానికి వర్మకి అగ్ని పరీక్షే. ఈ పరీక్షలో వర్మ నిలుస్తాడో, పడిపోతాడో చూడాలి.

Ram Goapal Varma Lakshmis NTR first look