లక్ష్మీపార్వతి పాత్రలో రోజా ?

Roja turns as Lakshmi Parvathi in Lakshmi's NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వర్మ ఎప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పేరు అనౌన్స్ చేసాడో అప్పటి నుంచి ఈ సినిమా గురించి లెక్కకు మించి ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని వాటి అంతట అవి వస్తుంటే ఇంకొన్ని వర్మ కావాలని పుట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి బాలయ్య అనుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ కి దీటుగా ” లక్ష్మీస్ ఎన్టీఆర్” కి పబ్లిసిటీ రావడానికి వర్మ వ్యూహాత్మకంగా లీక్స్ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో వైసీపీ నాయకురాలు రోజాకి ప్లేస్ ఉంటుంది అని వర్మ ఓ చిన్న క్లూ ఇచ్చాడు. ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పాత్రలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇక చంద్రబాబు, దగ్గుబాటి లాంటి పాత్రలకి స్కోప్ ఉంటుంది తప్ప అంతకు మించి లేడీ క్యారెక్టర్స్ కి ఇందులో పెద్ద స్థానం ఉండకపోవచ్చు. అంటే సినిమా మొత్తం మీద లక్ష్మీపార్వతి దే ముఖ్యమైన లేడీ క్యారెక్టర్. దాంతో రోజా ఈ సినిమాలో చేస్తారు అనగానే అది లక్ష్మీపార్వతి పాత్ర అయ్యి ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ గనుక ఎన్టీఆర్ పాత్రకి ఒప్పుకుంటే రోజా లక్ష్మీపార్వతి క్యారెక్టర్ కి సై అనవచ్చు.

ఇక వర్మ వెంట తిరుగుతున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” నిర్మాత అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా, ఎవరు అడ్డం వచ్చినా లెక్క చేయకుండా ఈ సినిమా తీస్తామని రాకేష్ రెడ్డి అంటున్నారు. వంగవీటి సినిమా విడుదలకి ముందు వర్మని నమ్మి ఇదే స్థాయిలో ఉత్సాహం చూపిన ఆ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, ఇప్పటికీ కేసులతో సతమతం అవుతున్నారు. వర్మ కి ఏ సెంటిమెంట్ ఉండదు. సినిమా అయిపోయాక దుమ్ము దులుపుకుని వెళ్ళిపోతాడు. దానికి సంబంధించి వచ్చే సమస్యల్ని ఎదుర్కోవాల్సింది నిర్మాత మాత్రమే. ఈ విషయం తెలుసుకోకుండా వర్మ మాటలు విని కొండని ఢీకొంటే తల పగలడం తప్ప ప్రయోజనం ఉండదు.